ఓం శ్రీమాత్రే నమః

అజ్ఞాన తిమిర సంహారణాలు ముక్తి ముఖద్వారాలు ఆలయాలు ఆశ్రమాలు

పవిత్రాణాయ సాధూనాం వినాశాయచదుష్కృతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే.

ఋషి శత్తములకు, యోగులకు, మహనీయులకు, అవధూతలకు నిలయమైన భారతావనిలో దక్షిణా గ్రాన విలసిల్లే సమయపుర దివ్యధామం లో ప్రభవించిన జ్ఞానభాస్కరులే ” శ్రీ శ్రీ శ్రీ సద్గురు శివశక్తిస్వామి” వారు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా శ్రీస్వామి వారు నిర్మించిన దివ్యధామం శ్రీదేవి మీనాక్షి శ్రీ చక్ర పీఠంసత్యం వదా, ధర్మం చరా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అనె వేదధర్మం సర్వమానవులకు స్వధర్మం కావాలని ఉద్దేశంతో రూపొందించిన సుజ్ఞాన సంజీవని శ్రీదేవి మీనాక్షి శ్రీ చక్ర పీఠం. సర్వ మానవులను రాగద్వేషాలకు దూరంగా సత్యధర్మాలకు దగ్గరగా దేహం భోగ సాధనం కాదని ధర్మ సాధనం అని ఉపదేశించె అమ్మ వడి సంస్కారాల బడి శ్రీదేవి మీనాక్షి శ్రీ చక్ర పీఠం.

సజ్జన సాంగత్యం, సాత్వికాహారం, సద్గ్రంథ పఠనం , సత్కర్మగా సద్గురువుల సేవ వలన వరి లైఫ్ నుంచి మానవులు మెర్రీ లైఫ్లో జీవించగలరు.దీన జీవనాన్ని విసర్జించి దివ్య జీవనాన్ని కొనసాగించగలరు.సద్భక్తి వలన నిర్మలత్వాన్ని సుజ్ఞానం వలన నిర్భయత్వాన్ని వైరాగ్య తపస్సుల వలన నిశ్చలత్వాన్ని పొందినవారు జీవితము సాధన వేరు కాదని గ్రహించిన సద్భక్తులకు ధర్మార్ధ కామ మోక్షములను అనుగ్రహించే జ్ఞాన గంగోత్రి శ్రీదేవి మీనాక్షి శ్రీచక్ర పీఠం.